Thursday, May 02
Breaking News:

భోళా శంకర్ రెమ్యూనరేషన్‌ను తిరిగిచ్చిన చిరంజీవి.. ఎన్ని కోట్లు అంటే

1692858460_bholaa-shankar-teaser-megastar-c.jpg

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమా చేశారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిక్డ్స్ టాక్‌ను తెచ్చుకుంది.

అది అలా ఉంటే భోళా శంకర్ కోసం చిరంజీవి 55 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే నిర్మాత ఇవ్వాల్సిన పేమెంట్ కొంత ఉండగా.. సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇవ్వాల్సిన 10 కోట్ల చెక్‌ను చిరంజీవి తిరస్కరించారట. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఇక ఈ రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవి అంత డిమాండ్ చేశాడని.. ఇంత డిమాండ్ చేశాడని.. ఇటీవల కొన్ని వార్తలు వైరల్ అవ్వగా.. నిర్మాత అనిల్ సుంకర.. అలాంటిదేమి లేదని.. అవన్ని ఫేక్ న్యూస్ అంటూ స్వయంగా ట్విట్టర్‌‌లో ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. చిరంజీవి మంచి మనిషి అని.. రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడనే వార్తల్లో నిజం లేదని ఆయన తన ట్వీట్‌లో పేర్కోంటూ క్లారిటీ ఇచ్చారు.

Prev Post కెసిఆర్ ఇచ్చిన మాటకు...
Next Post హుటాహుటిన అమెరికా వె...

More News