Thursday, May 02
Breaking News:

కెసిఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాపి - కూకట్ పల్లి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు.

1692780036_karmika.jpg

తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు కూకట్ పల్లి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు.

రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి మూసాపేట మున్సిపల్ కార్యాలయం నందు తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని ధర్నా చేపట్టారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవుట్సోర్సింగ్  ఉద్యోగులు అనే వాళ్ళు లేకుండా అందరినీ పర్మినెంట్ ఉద్యోగులుగా చేస్తామన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు అనుగుణంగా తమను పర్మినెంట్  ఉద్యోగులుగా ప్రకటించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని లేనియెడల ఎమ్మెల్యేల, మంత్రుల ఇళ్ళ్లను సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యుత్,ఆర్టీసీ ఉద్యోగులను పర్మినెంట్ చేశారని, మా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబ ఉన్నతికి సాయపడాలని కెసిఆర్ ను వేడుకుంటున్నామని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో  దాదాపు 20 వేలకు పైగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మీకు మద్దతు ఇస్తారని తెలిపారు.

Prev Post బెల్ట్ షాపుల రహిత ,...
Next Post భోళా శంకర్ రెమ్యూనరే...

More News