Thursday, May 02
Breaking News:

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు ఢిల్లీలో ఎన్నికల పరిశీలకులతో ఈసీ భేటీ

1696576833_50dbf9a4f89935654436993b934814b01692685834486263_original.jpg

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు చేస్తోంది. తెలంగాణ, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై ఈసీ సమీక్ష పూర్తి చేసింది. ఇది వరకే నాలుగు రాష్ట్రాల్లో సమీక్షలు నిర్వహించిన ఈసీ.. ఇటీవల మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించి ఎన్నికల సన్నద్ధతను సమీక్షించింది. సమీక్షలు పూర్తి కావడంతో.. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఢిల్లీలో ఈసీ ఇవాళ భేటీ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై వీరితో చర్చించిన అనంతరం.. ఏ క్షణమైనా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించి.. ఛత్తీస్ గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం డిసెంబర్ 10-15వ తేదీ మధ్య ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు
ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో సమీక్షలు పూర్తిచేసిన ఈసీ
ఇవాళ ఢిల్లీలో 5 రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఈసీ భేటీ
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై చర్చ
ఏ క్షణమైనా షెడ్యూల్‌ విడుదల చేసే ఛాన్స్
తెలంగాణ- రాజస్థాన్- మధ్యప్రదేశ్- మిజోరంలో ఒకే విడతలో పోలింగ్
ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ప్లాన్‌

ఢిల్లీ,ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు
ఢిల్లీ,ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో సమీక్షలు పూర్తిచేసిన ఈసీ
ఢిల్లీ,ఇవాళ ఢిల్లీలో 5 రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఈసీ భేటీ
ఢిల్లీ,అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై చర్చ
ఢిల్లీ,ఏ క్షణమైనా షెడ్యూల్‌ విడుదల చేసే ఛాన్స్
ఢిల్లీ,తెలంగాణ- రాజస్థాన్- మధ్యప్రదేశ్- మిజోరంలో ఒకే విడతలో పోలింగ్
ఢిల్లీ,ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ప్లాన్‌

Prev Post సైదాబాద్ లో ఘనంగా జా...
Next Post కిషన్‌ రెడ్డి అధ్యక్...

More News