Thursday, May 02
Breaking News:

‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో

1694673898_india alliance.jpg

ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరుగనుంది. అక్టోబరు మొదటి వారంలో సభ నిర్వహించాలని ఆ కూటమి నిర్ణయించింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో నిర్వహించిన ఇండియా బ్లాక్‌ కోఆర్డినేషన్‌ కమిటీ తొలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకం సహా పలు అంశాలపై ‘ఇండియా’ బ్లాక్‌ సమన్వయ కమిటీ చర్చించింది. అక్టోబర్‌ మొదటి వారంలో భోపాల్‌లో తొలి బహిరంగ సభ నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. బీజేపీ ప్రభుత్వంలోని అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలపై ఈ పబ్లిక్‌ మీటింగ్‌లో ప్రధానంగా లేవనెత్తనున్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సుమారు 25కుపైగా రాజకీయ పార్టీలు ‘ఇండియా’ కూటమి పేరుతో ఒకతాటిపైకి వచ్చాయి. కలిసికట్టుగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.

Prev Post తెలుగు రాష్ట్రాలకు మ...
Next Post ఎమ్మెల్సీ కవితకు ఈడీ...

More News