Thursday, May 02
Breaking News:

కాంగ్రెస్,బిజెపి పార్టీ ల నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు - కండువా కప్పి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ రేగా

1692860454_WhatsApp Image 2023-08-24 at 12.11.15 PM.jpeg

అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామ పంచాయతీ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు  రేగా కాంతారావు  సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్  ఆధ్వర్యంలో గురువారం నాడు పాటి చంద్రశేఖర్ బీజేపీ జిల్లా కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ,నాకిరి కంటి సావిత్రి   కాంగ్రెస్ వార్డు మెంబర్, వివిధ పార్టీల చెందిన 25 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాధరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  రేగా కాంతారావు గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్  నేతృత్వంలో ప్రజలకు సుపరిపాలన అందుతున్నదని,బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా తన పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాలు చూసే భారీగా చేరికలు జరుగుతున్నాయి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు బిజెపి కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలు లేవని వారన్నారు. అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని  ముఖ్యంగా మిషన్ భగీరథలు ప్రపంచ దేశాలకే రూల్ మోడల్ గా అలాగే వ్యవసాయరంగాన్ని అభివృద్ధి పరిశోధనలు ఇతర పెట్టుబడి కోసం రైతుబంధు సహాయాన్ని అందజేస్తున్నారు అన్నారు.పార్టీలో క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు నా దృష్టికి తీసుకురావాలని ఎల్లవేళల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని వారు అన్నారు.అన్ని వర్గాల ప్రజలకు బిఆర్ఎస్ పార్టీతోనే న్యాయం జరుగుతున్నదని ప్రజలు విశ్వసిస్తున్నారని ప్రతి ఒక్క కార్యకర్తకు బిఆర్ఎస్ పార్టీ జెండానే శ్రీరామరక్షా అని అన్నారు, శ్రమించి పనిచేసే ప్రతి కార్యకర్తకి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు.రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్  అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల రూపాయల బీమా సదుపాయం. పెన్షన్ రైతుల కోసం రైతుబంధు 24 గంటల ఉచిత విద్యుత్ పేదల కోసం కళ్యాణ లక్ష్మి షాదీముబారక్ వంటి పథకాలను అర్హులైన ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,నెల్లిపాక సర్పంచ్ గొర్రెముచ్చుఎస్సీ వెంకటరమణ,ఎంపీటీసీ గాదె జయ,నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్,సూదిరెడ్డి గోపి రెడ్డి,ఎక్స్ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,దైదా నారాయణరెడ్డి,ఈదర సత్యనారాయణ,మండల బిఆర్ఎస్ నాయకులు,యువజన నాయకులు,కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు తదితర నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Prev Post గోషామహల్ టికెట్ అడిగ...
Next Post వికలాంగులకు పెంచిన ప...

More News