Thursday, May 02
Breaking News:

కడియం శ్రీహరికి ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు

1692861074_bsp.jpg

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా నియోజకవర్గానికి సందర్భంగా కార్యకర్తలు అభిమానులు నెల్లుట్ల క్రాస్ రోడ్డు నుండి పెద్ద ఎత్తున స్వాగతం పలికి బైక్ ర్యాలీగా స్టేషన్గన్పూర్ నియోజకవర్గానికి చేరుకున్నారు.
అనంతరం శివాజీ రాజ్ విగ్రహము వద్ద నిర్వహించిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ  స్టేషన్ ఘనపూర్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని నాకు రాజకీయ జన్మనిచ్చింది స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలేనని అప్పటినుండి ఇప్పటివరకు పదవులున్న లేకపోయినా ప్రజలతో ఉంటూ సాధ్యమైనంత మటుకు ప్రజలతో మమేకమై ఉన్నానని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు నాపై ఉన్న నమ్మకంతో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం  కల్పించారని వారికి రుణపడి ఉంటానని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు  తెలియజేశారు.  నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను పేదల విషయాలను కళ్లారా చూశాను నా నియోజకవర్గంలో పేద బిడ్డలు ఉన్నారని పేద పిల్లల అభివృద్ధి కొరకే నాయకుడు అనే వాడు పనిచేయాలని అన్నారు ఏదో రకంగా పేద బిడ్డలను ఇబ్బంది పెట్టే రకంగా నాయకుడు ఉండకూడదని  కేసీఆర్ నాయకత్వంలో అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్ర ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదో సంవత్సరంలోకి అడుగు పెట్టారు. తెలంగాణ మొన్నటికి మొన్న దశాబ్ది ఉత్సవాలు పసలేని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో రూపించే అధ్యక్షునిగా ఉన్నాను పల్లెలో పచ్చగా ఉండాలని పల్లెలో ప్రతి ఒక్కరికి ఉపాధి దొరకాలని ఆనాడు చెప్పాను
ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ బిజెపి పార్టీలు రైతు రుణమాఫీలు ఎక్కడైనా చేశారా అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి రైతు రుణమాఫీ చేశాడని ఇది ఏ రాష్ట్రంలో జరగలేదని ముఖ్యమంత్రి చేయలేదని అన్నారు.రైతు రైతు బంధు పేరుమీద పదివేలు రైతు బీమా పేరుతో ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని అన్నారు రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం మని అన్నారు.మతి నీతి లేని మాటలు ప్రతిపక్ష పార్టీలో మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు.44 లక్షల ఆసరా పెన్షన్లు  ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు అదే కాకుండా ఒంటరి మహిళ గౌడన్న లకు నేతనులకు బోధకాలు ఉన్నవారికి వికలాంగులకు అన్ని రకాల స్పెషల్ కు పెన్షన్స్ అందజేస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వంమన్నారు. 
కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఎక్కడ పెన్షన్ ఇస్తున్నారు.సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో బిజెపి ప్రభుత్వ నాయకులు చెప్పాలన్నారు.

Prev Post వికలాంగులకు పెంచిన ప...
Next Post కొడంగల్ నుంచి రేవంత్...

More News