Thursday, May 02
Breaking News:

ముగిసిన అమర్‌నాథ్ యాత్ర..

1693551619_amarnath-yatra.jpg

అమర్‌నాథ్ యాత్ర ముగిసింది. హిమాలయాల్లో రెండు నెలలు పాటు సాగే ఈ యాత్ర గురువారం ముగిసింది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో వెలిసే మంచులింగం యాత్ర జులై 1న మొదలైంది. 62 రోజులు పాటు యాత్ర సాగింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ అమర్ నాథ్ యాత్ర ప్రశాంతంగా కొనసాగిందని అధికారులు తెలిపారు. అనంత‌నాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్లు పొడవైన నునవాన్ – పహల్గామ్ మార్గంతో‌పాటు గందేర్బల్ జిల్లాలోని 14 కిలో మీటర్ల పొడవైన బల్తల్ మార్గంలో సాగిన ఈ యాత్రలో 4.45 లక్షల మంది పాల్గొని శివలింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.

మహంత్ దీపేంద్ర గిరి నేతృత్వంలో సాధువులు, యాత్రికులు పెహల్గామ్ నుంచి 42 కిలో మీటర్లు దూరం నడిచి అమర్ నాథ్ కు చేరుకున్నారు. ఆ తరువాత గురువారం చివరి రోజు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యాత్రలో భారీ వర్షాల కారణంగా విరిగిపడిన కొండచరియలు, ఇతర కారణాలతో 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే గతేడాది 3.65 లక్షల మంది అమర్ నాథ్ శివలింగాన్ని దర్శించుకోగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 4.4లక్షలకు చేరింది. 2016 నుంచి ఈ ఏడాదే అత్యధిక సంఖ్యలో భక్తులు శివలింగాన్ని దర్శించుకున్నారు.

Prev Post చంద్రుడి ఉపరితలంపై 8...
Next Post సమాజానికి తుమ్మల నాగ...

More News