Thursday, May 02
Breaking News:

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల దరఖాస్తు స్వీకరణ

1693811352_BJP-Agitation-Programs.jpg

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల దరఖాస్తు స్వీకరణ మొదలైంది. 
ఆశావహుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది రాష్ట్ర బీజేపీ. ఇందుకోసం హైదరాబాద్‌ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు. 
మొత్తం మూడు పేజీలతో కూడా ఫారమ్‌ సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫారంలో నాలుగు పార్ట్‌లు ఉన్నాయి. మొదటి పార్ట్‌లో బీజేపీలో ఎప్పుడు చేరారు?
.. వ్యక్తిగత వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. పార్ట్‌-2లో ఎక్కడి నుంచి పోటీ చేశారనే విషయం ప్రస్తావించాలి.
 పార్ట్‌-3లో ప్రస్తుతం పార్టీలో నిర్వహిస్తున్న బాధ్యతలను పేర్కొనాలి. ఇక పార్ట్‌4లో క్రిమినల్‌ కేసులేమైనా ఉంటే..
 ఆ వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. తొలి దరఖాస్తును సికింద్రాబాద్ నుంచి రవి ప్రసాద్ గౌడ్ అందజేశారు. 
అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణలో కౌంటర్ ఇంచార్జీలుగా మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, GhMC 
మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్, మల్లేష్ తదితరులు ఉన్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల 
వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. చివరి తేదీని సెప్టెంబర్‌ 10వ తేదీగా నిర్ణయిచింది తెలంగాణ బీజేపీ.

Prev Post తెలుగు రాష్ట్రాల్లో...
Next Post కొనసాగుతున్న స్క్రీన...

More News