Thursday, May 02
Breaking News:

తిరుమలలో కనిపించిన మరో చిరుత..

1693552671_leopard-Aug17.jpg

తిరుమల అలిపిరి నడక దారిలో మరో చిరుతపులి కనిపించింది. ఆ మధ్య చిన్నారి లక్షితను ఓ చిరుతపులి ఎత్తుకుపోయిన మార్గంలోనే మరో చిరుతపులి ఇప్పుడు కనిపించింది. అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో చిరుత తిరుగుతూ కనిపించింది. వెంటనే అలర్టైన అటవీ అధికారులు.. అక్కడ ఓ బోనును ఏర్పాటు చేశారు. మళ్లీ ఆపరేషన్ చిరుత కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం భక్తులు గుంపులుగానే కొండపైకి వెళ్తున్నారు.

ఆపరేషన్ చిరుతలో భాగంగా.. ఇప్పటివరకూ 4 చిరుతపులులను బంధించారు. ఆగస్టు 11న ఆరేళ్ల చిన్నారి లక్షితపై చిరుతపులి దాడి చెయ్యడంతో.. ఆ చిన్నారి మృతి చెందింది. దీనిపై పెద్ద ఎత్తున కలకలం రేగింది. అంతకుముందు మరో బాలుడు కౌశిక్‌పై చిరుత దాడి చేసింది. ఆ చిరుతను అప్పుడే పట్టుకున్నారు. ఐతే.. చిన్నారి మృతితో… అప్రమత్తమైన టీటీడీ, అటవీ అధికారులు.. నడకదారిలో తిరిగే చిరుతల్ని పట్టుకోవడానికి ఆపరేషన్ చిరుతను ప్రారంభించారు.

Prev Post వాతావరణశాఖ హెచ్చరిక....
Next Post సామాజిక సేవ‌ల‌తో దూస...

More News